
జనరల్

నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ 2016 సంక్రాంతికి భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రం 2022 సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా మరో సినిమాను రూపొందించనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ గతంలో అధికారికంగా ప్రకటించింది.
అయితే వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రాజెక్ట్ తాత్కాలికంగా వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!