

యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ జులై 3, 2026న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో లేకపోవడం, పేరున్న దర్శకుడు కాకపోవడం వంటి అంశాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్ స్కేల్ ప్రాజెక్ట్‌లో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్, రిషబ్ సాహ్నీ వంటి నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలు, విస్తృత VFX పనులతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!