

నాగార్జున నటించిన మనం తర్వాత తాను అత్యంత భావోద్వేగంతో భాగస్వామ్యమైన చిత్రం లెనిన్ అని నాగార్జున తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా అఖిల్ అక్కినేని కెరీర్‌లో కీలక మలుపు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అర్బన్ పాత్రల్లో కనిపించిన అఖిల్‌ను గ్రామీణ నేపథ్యంలోని మాస్ పాత్రలో దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు అద్భుతంగా తీర్చిదిద్దారని, ఈ సినిమా ద్వారా అఖిల్ ప్రేక్షకులకు పూర్తిగా కొత్తగా కనిపిస్తాడని అన్నారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, కథ విన్న వెంటనే ఇది తప్పకుండా చేయాల్సిన సినిమా అని భావించానని చెప్పారు. ‘లెనిన్’ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతో కష్టపడ్డానని, కథలో అనేక మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేయగా, దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు తొలి సన్నివేశం నుంచి చివరి వరకు తెరపై అఖిల్ కాదు, ‘లెనిన్’ పాత్రే కనిపిస్తుందని అన్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!