

ధూమపానం అలవాటు పడిన తర్వాత దానిని మానేయడం కష్టంగా అనిపించినా, సరైన ప్రణాళిక, దృఢ సంకల్పం, జీవనశైలిలో మార్పులతో ఈ వ్యసనాన్ని అధిగమించడం సాధ్యమే. నిపుణులు చెప్పినట్లు, ముందుగా బలమైన నిర్ణయం తీసుకుని ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు కోసం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. టీ, కాఫీ, మద్యం వంటి ధూమపానానికి ప్రేరేపించే పరిస్థితులను గుర్తించి దూరంగా ఉండడం, సిగరెట్ల వినియోగాన్ని క్రమంగా తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.
పొగ తాగాలనే కోరిక వచ్చినప్పుడు యాలకులు, సోంపు నమలడం, షుగర్-ఫ్రీ గమ్ లేదా గింజలు తీసుకోవడం ద్వారా ఆ కోరికను నియంత్రించవచ్చు. వ్యాయామం, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు ఎంతో అవసరం. కొత్త హాబీలను అలవర్చుకోవడం ద్వారా దృష్టి మరల్చుకోవచ్చు. ధూమపానం మానేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!