

స్థానిక ప్రతిభకు వేదికగా రూపొందిన 'కొత్త సినిమా' చిత్రంలోని ప్రమోషనల్ సాంగ్ 'మేము కూడా సినిమా తీసినామురో' హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక-నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, దర్శకుడు సాయిలు కంపాటి, నటుడు ఆర్.కే. సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు అజర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 100 మంది కొత్త కళాకారులు టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషం.
ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ, స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించామని తెలిపింది. చరణ్ అర్జున్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధుర శ్రీధర్ రెడ్డి సినిమా విడుదలతో పాటు ఓటీటీ విడుదలకు కూడా సహకరిస్తానని హామీ ఇవ్వగా, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్థానిక ఫిల్మ్ మేకర్స్‌కు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!