

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. మహిళా ప్రాధాన్య కథతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాన నగరాల్లో వీకెండ్ షోలు హౌస్‌ఫుల్‌గా నడవగా, మొదటి రోజు రూ.13 కోట్లు, రెండో రోజు రూ.15 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల్లోనే సినిమా లాభాల బాట పట్టడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి కర్లీ హెయిర్ కారణంగా జడలు వేయడం ఇబ్బందిగా ఉండేదని, అందుకే హెయిర్ కట్ చేయించుకునేదాన్నని తెలిపారు. డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడూ కంఫర్ట్‌కే ప్రాధాన్యత ఇస్తానని, చిన్నతనం నుంచి షార్ట్స్ ధరించే అలవాటు ఉందని చెప్పారు. ఖరీదైన దుస్తుల కంటే సౌకర్యవంతమైన దుస్తులనే ఇష్టపడతానని, అందుకే తన స్టైల్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!