

లేడీ సూపర్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతారకు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. భారీ పారితోషికాలు, పెద్ద సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ వరుస పరాజయాలు ఆమె మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది తెలుగులో విడుదలైన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ‘మూకుర్తి అమ్మన్ 2’ (మహాశక్తి)పై భారీ అంచనాలు ఉండగా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే కవిన్‌తో నటించిన ‘హాయ్’ కూడా నిరాశపరిచింది. ‘టాక్సిక్’లో కీలక పాత్ర చేసినా ఆశించిన ఫలితం రాలేదు.
వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఇప్పుడు నయనతార తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. నివిన్ పౌలీతో కలిసి నటిస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలోని ‘నయనతార 81’, పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రక్కాయి’ ఆమె భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ‘రక్కాయి’లో సరికొత్త యాక్షన్ పాత్రలో కనిపించనుండటం ఆసక్తి పెంచుతోంది. వీటితో పాటు రజినీకాంత్‌తో ‘ధర్మన్’, సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందనున్న భారీ హిందీ సినిమా కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ చిత్రాలు విజయవంతమైతే నయనతారకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. తన స్టార్‌డమ్‌ను వసూళ్ల రూపంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆమె ముందుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!