

సౌత్ ఇండియన్ సినిమాలో వరుస విజయాలతో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మంచి జోష్‌లో ఉన్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మండాడి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ నయీ నవేలీ అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.
జీవీ ప్రకాష్‌కు హిందీ సినిమాలతో గతంలోనూ అనుబంధం ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలకు స్కోర్ అందించగా, జోకర్, అగ్లీ సినిమాలకు పాటలు సమకూర్చాడు. అయితే, నయీ నవేలీకి పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని కూడా ఆయనే అందించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ఆనంద్ ఎల్. రాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారి సినిమాతో గుర్తింపు పొందిన బాలాజీ మోహన్ ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అమరన్ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతానికి జీవీ ప్రకాష్ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. నయీ నవేలీ విజయవంతమైతే హిందీ చిత్ర పరిశ్రమలో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!