

ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మరియు ఫాంటమ్ ఈవెంట్స్ ప్రచురణ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన నటనా ప్రస్థానంలో ఆయన అనేక ప్రసిద్ధ సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, జేమ్స్ బాండ్ చిత్రం ‘క్యాసినో రాయల్’, సైన్స్ ఫిక్షన్ సిరీస్ ‘డాక్టర్ హూ’లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘డాక్టర్ హూ’లోని ‘సిటీ ఆఫ్ డెత్’ ఎపిసోడ్‌లో ఆయన నటన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ ఎపిసోడ్ 16 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ‘బ్లేక్స్ 7’, ‘క్యాజువాలిటీ’, ‘ది బిల్’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన చాడ్‌బాన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!