
టెక్నాలజీ

ఉత్తరాఖండ్‌లో బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జోషీమఠ్ సమీపంలోని చాయ్ గ్రామం వద్ద హెలికాప్టర్ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వార్తతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారణకు ఆదేశించారు. మరోవైపు, ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. హెలికాప్టర్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సాంకేతిక కారణాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!