1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

Writer: Chandrika 04:01 PM, 1 నవంబర్, 2026
బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు ‘మిస్టర్‌ రోబోట్‌’ అనే సైబర్‌ నేర ముఠా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌ భద్రతా సంస్థ క్లౌడ్‌సెక్‌ గుర్తించింది. ఈ ముఠా ఇతర నేరగాళ్లకు కూడా మాల్‌వేర్‌ను అద్దెకిస్తూ, మోసాలకు అవసరమైన సాధనాలను అందిస్తున్నట్లు తన పరిశోధనలో వెల్లడించింది. సుమారు 36 రకాల నకిలీ యాప్‌లను రూపొందించగా, వాటిలో 9 యాప్‌లు బ్యాంకుల పేర్లతో ఉన్నట్లు తెలిపింది. గ్యాస్‌, నీరు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జీలు, ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపు సేవల పేరుతోనూ నకిలీ యాప్‌లను తయారు చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలాన్‌ చెల్లించాలంటూ రూ.9-10 రుసుము అడిగి, ఆ ప్రక్రియలో పాన్‌ నంబరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబరు వంటి వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ముఠా టెలిగ్రామ్‌ బాట్‌, వెబ్‌ ఆధారిత కంట్రోల్‌ ప్యానెల్‌ ద్వారా ఇతర నేరగాళ్లకు నకిలీ యాప్‌లను రూపొందించే సదుపాయం కల్పిస్తోంది. ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత దాని ఐకాన్‌ కనిపించకుండా పోయినా, అది బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ బ్యాంకు ఓటీపీలను తస్కరించగలదు. ఆధార్‌, పాన్‌, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలు, సీవీవీ, ఏటీఎం, యూపీఐ పిన్‌లు, నెట్‌బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను కూడా సేకరించవచ్చు. అంతేకాకుండా బ్యాంకు నుంచి వచ్చే కాల్స్‌ను మరో నంబరుకు మళ్లించి, మోసపూరిత లావాదేవీలపై వచ్చే హెచ్చరికలు ఖాతాదారులకు చేరకుండా చేయవచ్చు. భద్రతా వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు మాల్‌వేర్‌ కనీసం 48 గంటలు లేదా యాప్‌ను మూడుసార్లు తెరిచే వరకు వేచి ఉండే అవకాశం ఉందని క్లౌడ్‌సెక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ వంటి అధికారిక వేదికల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. ఫోన్‌లో తెలియని మార్పులు కనిపించినా, బ్యాంకు కాల్స్‌ ఆగిపోయినా వెంటనే బ్యాంకును సంప్రదించి ఖాతా భద్రతకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల

అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన

దక్షిణాఫ్రికాలో కొత్త టాటా పంచ్ విడుదల..

దక్షిణాఫ్రికాలో కొత్త టాటా పంచ్ విడుదల..

కాన్వా బ్రష్ ఏఐ మోడల్‌ విడుదల.. టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో డిజైన్లలో మార్పులు

కాన్వా బ్రష్ ఏఐ మోడల్‌ విడుదల.. టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో డిజైన్లలో మార్పులు

Vi ఖాతాదారులకు శుభవార్త.. డేటా అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు

Vi ఖాతాదారులకు శుభవార్త.. డేటా అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు

ఏఐ కోడింగ్ ఖర్చులను తగ్గించేలా గిట్‌హబ్ కొత్త టూల్..

ఏఐ కోడింగ్ ఖర్చులను తగ్గించేలా గిట్‌హబ్ కొత్త టూల్..

ట్యాగ్లు
మిస్టర్‌ రోబోట్‌సైబర్‌ నేరాలుబ్యాంకింగ్‌ మోసాలునకిలీ యాప్‌లుఓటీపీ చోరీక్లౌడ్‌సెక్‌మొబైల్‌ భద్రతఆన్‌లైన్‌ మోసాలుకాల్‌ ఫార్వార్డింగ్‌సైబర్‌ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం
ఆరోగ్యం

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!
టెక్నాలజీ

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..
బిజినెస్

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్
రాజకీయాలు

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..
క్రీడలు

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్
క్రీడలు

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్
సినిమాలు

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!