

ఇటీవలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో, నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి నెలకొనగా, నేచురల్ స్టార్ నాని నిర్మాతగా భాగస్వామి కావడం మరింత అంచనాలను పెంచింది. తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో నితిన్ హంగూ ఆర్భాటం లేని మధ్యతరగతి యువకుడి లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
మురళీకాంత్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని, దీప్తి గంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పాటలు ప్రచారానికి కీలకంగా మారే అవకాశం ఉంది. విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, రుక్మిణీ పాత్రలో నటించే హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. షూటింగ్ సజావుగా సాగుతున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ప్రమోషనల్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!