

నితిన్ హీరోగా నటిస్తూ, నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న తాజా చిత్రం ‘ఏలియాస్ రుక్మిణి’ ప్రకటన నుంచే టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో రుక్మిణి పాత్రలో కొత్త నటి ఆఫియా సయ్యద్‌ను పరిచయం చేశారు. పసుపు రంగు సంప్రదాయ చీరలో, చేతిలో పుస్తకాలు పట్టుకుని స్ట్రిక్ట్ టీచర్‌గా ఆమె తరగతి గదిలోకి వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విద్యార్థులు వేసిన కార్టూన్ డ్రాయింగ్‌తో పాటు బోర్డుపై “డెవిల్”, “హిట్లర్”, “హోమ్‌వర్క్ పోలీస్” వంటి పదాలు కనిపించడం గ్లింప్స్‌లో ఆసక్తికరంగా మారింది. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టి. జాన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. నాని సమర్పణలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!