

రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం తెరదించింది. సోషల్ మీడియాలో సినిమా విడుదల వాయిదా పడిందన్న ప్రచారం నేపథ్యంలో స్పందించిన మేకర్స్, ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని అధికారికంగా వెల్లడించారు.
సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌తో పాటు చిత్రానికి సంబంధించిన వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార సామగ్రికి మంచి స్పందన లభించడంతో త్వరలో వరుస అప్‌డేట్లను విడుదల చేసి ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!