

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. రెండో వారంలో వసూళ్లు కొంత తగ్గినప్పటికీ, 17వ రోజు మాత్రం మంచి వృద్ధి నమోదైంది. సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. శనివారం ఈ చిత్రం రూ.9.35 కోట్ల వసూళ్లు సాధించింది. శుక్రవారం వచ్చిన రూ.5.50 కోట్లతో పోలిస్తే దాదాపు 70 శాతం వృద్ధి కనిపించింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.520.35 కోట్లకు, నెట్ వసూళ్లు రూ.444.75 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.790.85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా.
17వ రోజు ఒక్క శనివారమే తమిళంలో రూ.6.70 కోట్లు, హిందీలో రూ.1.45 కోట్లు, తెలుగులో రూ.90 లక్షలు, కన్నడ వెర్షన్‌లో రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ఈ ఘనత సాధించిన తొలి తమిళ చిత్రంగా ‘జైలర్ 2’ చరిత్ర సృష్టించనుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో కనిపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!