
రాజకీయాలు

హాలీవుడ్లో భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ ఉంటేనే విజయం సాధ్యమని భావనను ‘అబ్సెషన్’ సినిమా పూర్తిగా తలకిందులు చేసింది. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ సుమారు రూ.2000 కోట్ల వసూళ్లను సాధించింది. కంటెంట్ బలం ఉంటే చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధించగలవని ఈ చిత్రం నిరూపించింది.
విడుదలైన వెంటనే మంచి టాక్ రావడంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా సినిమా వేగంగా ప్రేక్షకులను ఆకర్షించింది. భారతదేశంలో కూడా ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే ‘ఫైనల్ డెస్టినేషన్’ రికార్డును దాటిన ఈ చిత్రం, ప్రస్తుతం ‘ది కంజూరింగ్’ తర్వాత రెండో స్థానంలో ఉంది. థియేట్రికల్ రన్ కొనసాగుతున్నందున మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!