
ఆరోగ్యం

కోలీవుడ్‌లో నటి త్రిష, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో, గతంలో విజయ్, త్రిష, ఉదయనిధి కలిసి పాల్గొన్న సినిమా కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదానికి ముందు ముగ్గురూ పలు సినిమా ఈవెంట్లలో కలిసి కనిపించారు.
2008లో విడుదలైన విజయ్-త్రిష జంటగా నటించిన ‘కురువి’ సినిమా ఆడియో విడుదల, 150 రోజుల విజయోత్సవ వేడుకల్లో విజయ్, త్రిష, ఉదయనిధి స్టాలిన్ ఒకే వేదికపై పాల్గొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి వీడియోలు, ఫొటోలు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమా రంగంలో కలిసి కనిపించిన ఈ ముగ్గురు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో భిన్నమైన పాత్రల్లో ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!