

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో రవితేజ నటించిన ఇరుముడి చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడిని ఆశిస్తారని, ఆ తర్వాత మరో సినిమా చేసేందుకు అవసరమైన నిధులు సమకూరితే సంతోషిస్తారని తన అనుభవంతో చెప్పారు. ఇరుముడిలోని తండ్రీకూతుళ్ల అనుబంధం తనకు సర్పయాగం చిత్రాన్ని గుర్తు చేసిందని తెలిపారు. కుమార్తెకు జరిగిన అన్యాయానికి తండ్రి ప్రతీకారం తీర్చుకోవడం కథలోని ప్రధాన భావోద్వేగ అంశంగా ఉందన్నారు. అలాగే ‘ఇరుముడి’ అనే టైటిల్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిందని అభిప్రాయపడ్డారు.
సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని చివరి వరకు ప్రేక్షకులకు తెలియకుండా ఉంచిన విధానం, చివరి అరగంటలో కొనసాగిన ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే తనకు నచ్చాయని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ముఖ్యంగా సాయికుమార్ పోషించిన గురుస్వామి పాత్రకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ను ప్రస్తావించారు. అయితే సాయికుమార్, అజయ్ ఘోష్ పాత్రల ముగింపు మరింత భిన్నంగా ఉంటే బాగుండేదేమోనని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. క్లైమాక్స్‌ను కూడా మరో విధంగా చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కథకు అవసరమైతే ప్రేక్షకులు హీరో చేసే చర్యలను కూడా అంగీకరిస్తారని, ప్రేక్షకులను తక్కువగా అంచనా వేయకూడదని అన్నారు. కొత్త కథలు రాసే రచయితలు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించాలని సూచించారు. ఇరుముడి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!