
బిజినెస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన షాడో లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ నీడ రూపంలో కనిపించగా, ప్రభాస్ పొడవాటి జుట్టు, టోపీతో కనిపించారు. త్వరలో ఆయన పూర్తి లుక్‌ను విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!