

నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఇందులో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్ర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేసీఆర్ శైలి, హావభావాలను పోలినట్లు కనిపించే ఈ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నారు. కేసీఆర్ ప్రసంగాలను పోలిన సంభాషణలు, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకుంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో టికెట్లు వేగంగా అమ్ముడవగా, సినిమా విడుదలైన తర్వాత కూడా అదే జోరు కొనసాగుతోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికల్లో ఇప్పటివరకు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సంఖ్య నాని కెరీర్‌లో రికార్డు స్థాయికి చేరిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!