
రాజకీయాలు

గతేడాది ‘ఓజీ’ చిత్రంలో కన్మని పాత్రలో కనిపించి యువతను ఆకట్టుకున్న నటి ప్రియాంక మోహన్, ఇటీవలే ఓటీటీ చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆమె కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు హేమంత్ ఎం రావు తెరకెక్కిస్తున్నారు. డాలీ ధనంజయ ధనంజయ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1970ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను “కలల మిషన్ ఆవిష్కరణ” అనే పేరుతో వచ్చే నెల 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్‌తో ప్రమోషన్లు ప్రారంభమవుతాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!