

భారతీయ సినీ చరిత్రలో చిరంజీవి పేరు కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, కోట్లాది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందింది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, రచయిత రాజ్ నిడిమోరు చిరంజీవి ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్, తన స్నేహితుడు కృష్ణ డీ.కేతో కలిసి పలు విజయవంతమైన హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందించారు. తమ రచనల్లో మెగాస్టార్ చిరంజీవి పాటలు, రిఫరెన్స్‌లకు ప్రత్యేక స్థానం కల్పించామని ఆయన వెల్లడించారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గన్స్ అండ్ గులాబ్స్, గో గోవా గాన్ వంటి ప్రాజెక్టుల్లో చిరంజీవి పాటలను ఉపయోగించామని తెలిపారు. అవి తమ విజయాల్లో కూడా భాగమయ్యాయని పేర్కొన్నారు. పాత్రలు తమ మాతృభాషలో మాట్లాడేలా చూపించడం ద్వారా కథలకు సహజత్వం తీసుకురావాలని ప్రయత్నించామని చెప్పారు. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ వంటి ప్రాజెక్టుల్లో ప్రాంతీయ సంస్కృతి, తెలుగు మూలాలను ప్రతిబింబించే అంశాలను చేర్చడం తమకు గర్వకారణమని రాజ్ నిడిమోరు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!