

రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాజా ది రాజా’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. విడుదల తేదీ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ, వారి సరదా ప్రయాణం ఆకట్టుకునే విధంగా చూపించారు. రంగురంగుల విజువల్స్, రొమాంటిక్ టోన్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!