

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హృతిక్ రోషన్ నిజంగానే ‘జైలర్ 2’లో భాగమైతే హిందీ మార్కెట్లో సినిమాపై మరింత క్రేజ్ పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే విద్యా బాలన్, ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!