
జనరల్

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు, ఆసక్తి మధ్య విడుదలైన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ ఎపిక్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ మార్కెట్‌తో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్ల ద్వారా దక్షిణాది మార్కెట్‌లో ఈ చిత్రం రూ.100 కోట్ల నెట్ వసూళ్లను అధిగమించినట్లు తెలుస్తోంది. ఈ ఘనత సాధించిన తొలి హిందీ సినిమాగా ‘రామాయణ’ నిలిచినట్లు సమాచారం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి వసూళ్లు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!