
క్రీడలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న దీపావళి హై టీ విందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ, ఇప్పటికే ఇతర కార్యక్రమాలు ఖరారై ఉండటంతో తాను హాజరుకాలేనని సిద్ధరామయ్య వెల్లడించినట్లు సమాచారం. అయితే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ ఈ విందుకు హాజరుకానున్నారు.
మరోవైపు, కర్ణాటకలో వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషన్ వివాదంపై రాహుల్ గాంధీకి డీకే శివకుమార్ ప్రత్యేకంగా వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీలో చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య గైర్హాజరు, డీకే శివకుమార్ ప్రత్యేక భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!