
జనరల్

వెర్సటైల్ హీరో విశాల్ నటిస్తున్న ‘మకుటం’ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో విశాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బి చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ‘రైజ్ ఆఫ్ లింగా’ పాటను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పాటలో విశాల్ ‘లింగా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, జి.వి. ప్రకాష్ సంగీతం, విశాల్-జి.వి. ప్రకాష్ కలిసి పాడిన గానం ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి ఆదరణ పొందుతోంది. చిత్రబృందం ఈ సినిమాను జూలైలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!