

సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా విడుదలైన ‘అనుమాన పక్షి’ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి కశ్మీర్ అందాల వరకు సాగే ప్రయాణం నేపథ్యంలో కథను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కథానాయకుడి జీవితంలో చోటుచేసుకునే గందరగోళ పరిస్థితులు, అతడి అతిగా ఆలోచించే స్వభావం కథలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. రాగ్ మయూర్ కథానాయకుడిగా, మేరిన్ ఫిలిప్ కథానాయికగా నటించారు.
ట్రైలర్‌లో వినోదంతో పాటు ఉత్కంఠకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజీవ్ చిలక తదితరులు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో చిత్రబృందంలోనూ నమ్మకం పెరిగింది. విభిన్నమైన కథనం, కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు ‘అనుమాన పక్షి’ సిద్ధమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!