

నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌తో పాటు కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే పాట విడుదలైన వెంటనే దాని సాహిత్యంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా పాటలో శ్రీకృష్ణ భగవానుని పేరు ప్రస్తావించడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రాముడి అవతారం తర్వాత శ్రీకృష్ణుడి అవతారం వచ్చిందనే సంప్రదాయ విశ్వాసం నేపథ్యంలో, రామాయణ కథకు సంబంధించిన పాటలో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఎలా వచ్చిందంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పాట సాహిత్యాన్ని చిత్రబృందం సరిగా పరిశీలించలేదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చపై మేకర్స్ స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా, యష్ నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!