
బిజినెస్

కడప జిల్లా పులివెందులలో అర్ధరాత్రి వినాయక విగ్రహం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. తనను సన్మానించలేదంటూ విజయ్.. పుష్పనాథ్‌ను ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలై, అనంతరం ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ మాభాషా గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం విజయ్ ఇంటి వద్ద ఉన్న మూడు వాహనాలను పుష్పనాథ్ వర్గీయులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుండగా, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!