

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ ఆ తర్వాత ‘గుణ 369’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’, ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే 2024లో విడుదలైన ‘భజే వాయు వేగం’ తర్వాత ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన రాలేదు. దీంతో కార్తికేయ తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ లాంగ్ గ్యాప్‌లో కార్తికేయ తన సొంత కథపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!