

ప్రస్తుతం గర్భధారణ దశను ఆస్వాదిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు బేబీ బంప్ ఫొటోలను కూడా పంచుకుంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, మాతృత్వంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజ్ నిడిమోరుతో కలిసి పిల్లలు ఉన్నా లేకపోయినా తమ బంధం, అన్యోన్యతే ముఖ్యమని భావించినట్లు సమంత తెలిపారు. అయితే ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే గర్భం దాల్చడం తమ జీవితంలో ఊహించని ఆనందాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డను ఆడా, మగా అనే తేడా లేకుండా ఎంతో ఆనందంగా స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తన జీవితం పూర్తిగా మారిపోవడంతో పాటు సరికొత్త బాధ్యతలను స్వీకరించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!