
జనరల్

నటి సమంత ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఆనందకరమైన దశను ఆస్వాదిస్తున్నారు. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, సమంత తల్లి కాబోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మాతృత్వంపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో తన బిడ్డే తన ప్రపంచమని, పిల్లల పెంపకాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుంటానని సమంత చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో ‘మా ఇంటి బంగారం’ మూడు రోజుల్లో రూ.43 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ విజయంపై నటి నయనతార కూడా సమంతకు అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!