

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’పై హీరో విరాట్ కర్ణ పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విరాట్ కర్ణ తన పాత్ర కోసం చేసిన కృషిని వివరించారు.
ఈ సినిమాలో నాగసాధువు పాత్రలో కనిపించనున్నానని, ఆ పాత్ర కోసం శారీరకంగా పూర్తిగా మారడంతో పాటు గుర్రపు స్వారీ, డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని విరాట్ కర్ణ తెలిపారు. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసినట్లు, అనంతరం శివమాల కూడా ధరించినట్లు వెల్లడించారు. దర్శకుడు ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారని, ‘నాగబంధం’ చిత్ర విజయం మొత్తం చిత్రబృందానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!