

సుడిగాలి సుధీర్‌గా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ ఆనంద్ హీరోగా, ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘హైలెస్సో’ నుంచి నటుడు శివాజీ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శివాజీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో ఆయన ‘లైలం బాబు’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. నల్లటి దుస్తులు, పంచెకట్టు ధరించి రాతి సింహాసనంపై కూర్చుని చేతిలో సీసా పట్టుకున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అక్షర గౌడ, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. శివాజీ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!