
బిజినెస్

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన తాజా థ్రిల్లర్ ‘ది వాన్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. తొలి రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు అందించిన కథనం పేర్కొంది. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్‌గా ‘ది వాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌పై ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!