

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు సోషల్ మీడియాలో ద్వేషం, ట్రోలింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తూ, తమ లక్ష్యాలు, కుటుంబం, కెరీర్, సంతోషాన్ని ఇచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నచ్చని వ్యక్తుల గురించి సమయాన్ని వృథా చేయకుండా, జీవితంలో సానుకూల అంశాలపై దృష్టి సారించాలని బన్నీ సూచించారు.
అయితే ప్రసంగం చివర్లో ఉదాహరణగా చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. కొందరు నెటిజన్లు ఆ వ్యాఖ్యను మహిళల భద్రత, స్టాకింగ్ వంటి అంశాలతో అనుసంధానిస్తూ అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు అల్లు అర్జున్ అసలు ఉద్దేశం ట్రోలింగ్‌ను నిరుత్సాహపరచడమేనని, ఒక ఉదాహరణను సందర్భం నుంచి వేరు చేసి విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంతో పాటు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!