

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’. నగరంలో వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులను తప్పుదోవ పట్టించే ఓ సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అతడి ఆచూకీ కనిపెట్టి కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ యుగంధర్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. 24 గంటల్లోనే మృతదేహాలు మాయమవడం, ఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ మృతదేహం అదృశ్యమవడం వంటి పరిణామాలతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులోని సస్పెన్స్ సన్నివేశాలు, ఆది సాయికుమార్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రాఘవేంద్ర కటారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ కథానాయికగా నటిస్తుండగా, మార్కస్ ఎన్ సంగీతం అందిస్తున్నారు. ‘ఒక రహస్యమైన కేసు.. నిర్భయమైన అధికారి.. ప్రమాదాలతో కూడిన మిషన్..’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో విడుదలైన ట్రైలర్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!