4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు

Writer: G.Sreekanth Reddy 09:13 AM, 4 నవంబర్, 2026
కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో, రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్‌లో లక్ష్మణుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు సునీల్ లహ్రీ స్పందించారు. సినిమాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, సంగీతం విషయంలో మాత్రం కొద్దిగా నిరాశ చెందానని తెలిపారు.

ఈ విషయమై మంగళవారం తన ఎక్స్ ఖాతాలో సునీల్ లహ్రీ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి నా అభిప్రాయం చెప్పాలని చాలామంది అడుగుతున్నారు. ఒకప్పుడు నేను కూడా రామాయణంలో భాగం కావడం వల్లే కావొచ్చు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. నేను ఈ సినిమాను ఇంకా చూడలేదు. ఈ ఇతిహాసంపై నేను విమర్శకుడిని కాదు. ఇది కేవలం మన భారతీయులకే కాదు, ప్రపంచ మానవాళి మొత్తానికి గొప్ప కావ్యం" అని పేర్కొన్నారు.

అయితే, సంగీతం విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్, హాన్స్ జిమ్మర్ వంటి దిగ్గజాలు సంగీతం అందిస్తున్నా, నేను విన్న కొన్ని పాటలు, ధ్వనులు నన్ను కొద్దిగా నిరాశపరిచాయి. రామాయణ గాథలో సంగీతం వెన్నెముక లాంటిది. మిథిల, అయోధ్యకు సంబంధించిన స్థానికత ఆ సంగీతంలో కనిపించాలని నేను భావిస్తున్నాను. ఒక సాధారణ శ్రోతగా ఇది నా అభిప్రాయం మాత్రమే" అని వివరించారు.

సినిమా బృందాన్ని ప్రశంసిస్తూ "దర్శకుడు నితేశ్ జీ ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఆయనపై, ఈ చిత్రంలోని నటీనటులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారంతా కలిసి ఎంతో కష్టపడి ఒక మంచి చిత్రాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీస్తున్న సినిమా. దీని విజయం చాలా అవసరం. ఎందుకంటే ఎందరో జీవితాలు ఈ సినిమాపై ఆధారపడి ఉన్నాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్" అంటూ తన మాటలను ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
రణ్‌బీర్ కపూర్'రామాయణ' సినిమాసునీల్ లహ్రీదర్శకుడునితేశ్ తివారీఏ.ఆర్. రెహమాన్హాన్స్ జిమ్మర్సంగీతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు
జనరల్

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?
సినిమాలు

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?
సినిమాలు

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!
క్రీడలు

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?
సినిమాలు

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఏపీకి మరో తుఫాను ముప్పు..
జనరల్

ఏపీకి మరో తుఫాను ముప్పు..

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?
సినిమాలు

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?
గాసిప్స్

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్
షోస్

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు
సినిమాలు

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
జనరల్

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!