

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. శ్రీకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటి జయసుధ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్‌పై ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌తో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నారని, అయితే ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఆ విషయం తెలియదని అన్నారు. గతంలోనే అల్లు అరవింద్‌తో కలిసి నటించాలని తన కోరికను వెల్లడించినట్లు గుర్తుచేసుకున్నారు. ‘అరవింద్‌గారూ.. ఒక సినిమా తీయండి. మనమిద్దరం కలిసి నటిద్దాం’ అని చెప్పినట్లు తెలిపారు. ఆమె చేసిన ఈ సరదా వ్యాఖ్యలు వేడుకలో నవ్వులు పూయించగా, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!