
క్రీడలు

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే చెన్నై సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 07059 నంబర్ గల చర్లపల్లి-చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు ఈ నెల 6వ తేదీ రాత్రి 9.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 07060 నంబర్ గల చెన్నై సెంట్రల్-చర్లపల్లి ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 12.40 గంటలకు చెన్నైలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ రైల్వే వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!