

పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు ఆయన ప్రత్యేకమైన స్టైలింగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ‘బాలు’ సినిమాలో ఆయన ధరించిన దుస్తులు అప్పట్లో యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించాయి. హూడీలు, కార్గో ప్యాంట్లు, విభిన్నమైన ఫ్యాషన్ ప్రయోగాలతో పవన్ తనదైన శైలిని చూపించారు. ఈ సినిమాలో ఆయన ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ల గురించి తాజాగా రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో పవన్ దుస్తుల ఎంపిక, స్టైలింగ్ బాధ్యతలను తానే చూసుకునేవారని తెలిపారు. ‘బాలు’ సినిమాలో ఉపయోగించిన తరహా ప్యాంట్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు మాత్రమే అందుబాటులో ఉండేవని, వాటి తయారీలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి వస్త్రాన్ని ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు.
ఇక లండన్‌లో జరిగిన షాపింగ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని కూడా రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు. అక్కడి ప్రముఖ షాపింగ్ మాల్‌లో పవన్ కల్యాణ్ కోసం తాను దుస్తులు కొనుగోలు చేసేవారని, అదే మాల్‌కు షారుఖ్ ఖాన్ కోసం షాపింగ్ చేసేందుకు దర్శకుడు కరణ్ జోహార్ కూడా వచ్చేవారని తెలిపారు. ఆ సమయంలో పవన్, షారుఖ్ స్టైలింగ్ అభిరుచులు కూడా కొంతవరకు ఒకేలా ఉండేవని ఆమె వెల్లడించారు. ఈ విషయాలకు సంబంధించిన రేణు దేశాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!