

నానికి 'దసరా'తో కెరీర్లో తొలి వంద కోట్ల విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు అదే స్థాయి విజయాన్ని శర్వానంద్‌కు అందించాలని దర్శకుడు సంపత్ నంది గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న 'భోగి'పై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకోని శర్వానంద్‌కు, దర్శకుడిగా ఆ స్థాయి వసూళ్లు సాధించని సంపత్ నందికి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. అందుకే కథ, పాత్రల రూపకల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
1960ల తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో గంగ పాత్ర కోసం శర్వానంద్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. మాస్ లుక్, పోరాట సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్ సన్నివేశాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. బలమైన కథ, కుటుంబ అనుబంధాలు, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు తోడైతేనే భారీ వసూళ్లు సాధ్యమవుతాయి. మరి 'దసరా' తరహాలో 'భోగి' కూడా వంద కోట్ల క్లబ్లో చేరి ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు తెస్తుందా అనేది చూడాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!