

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా, ప్రచార కార్యక్రమాల మధ్య కొన్ని అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో ప్రస్తావించిన ‘ముక్క సుక్క’ అనే విషయంపై చర్చ జరగడంతో తబితా సుకుమార్ తాజాగా స్పందించారు. అది తెలంగాణ సంస్కృతిలో భాగమైన ప్రత్యేక ఆచారం కాదని, పెద్దల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసే విధానమని ఆమె స్పష్టం చేశారు.
ఈ సినిమా మొదట టైటిల్ కారణంగా విమర్శలు ఎదుర్కోగా, తర్వాత ‘గడప’ పాటలోని దృశ్యాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పెళ్లి సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తబితా ఇచ్చిన వివరణతో వివాదం సద్దుమణుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా చుట్టూ తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!