

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ థ్రిల్లర్ వృశకర్మ డిసెంబర్ 4, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. నిన్న రాత్రి నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాగచైతన్య సినిమా రన్‌టైమ్‌పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 50 నిమిషాలని స్పష్టం చేశారు. దీంతో సినిమా మూడు గంటలకు పైగా ఉంటుందనే ప్రచారానికి తెరపడింది.
సినిమాలో దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని నాగచైతన్య తెలిపారు. దర్శకుడి ఆలోచనలను తెరపై అత్యుత్తమంగా ఆవిష్కరించేందుకు వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. అయితే సినిమా తుది నిడివి, ఇతర వివరాలపై మరింత స్పష్టత రావాలంటే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!