

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అభిమానుల్లో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను మరో స్థాయిలో చూపించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా విడుదల సమయంలో అభిమానుల్లో కనిపించిన ఉత్సాహం సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘ఓజి’ సీక్వెల్ విషయంలో ఆయన ఇచ్చిన సమాచారం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
దర్శకుడు సుజీత్ ‘ఓజి 2’ కథను థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయే స్థాయిలో సిద్ధం చేశాడని థమన్ వెల్లడించాడు. అంతేకాదు, ఈ కథతో రెండో భాగమే కాకుండా మూడో భాగం కూడా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ‘ఓజి’ సిరీస్ మరింత విస్తరించబోతుందనే చర్చ మొదలైంది. అయితే ఈ మూడు సినిమాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమయం కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రెండో భాగం నిర్మాణ బాధ్యతలను పవన్ కళ్యాణ్ స్వయంగా చేపట్టనున్నట్లు సమాచారం. సుజీత్ ప్రస్తుతం ‘బ్లడీ రోమియో’ పనులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!