
బిజినెస్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకు కర్ణాటకలో మంచి స్పందన లభించగా, విడుదలైన తొలి రోజు కూడా వసూళ్లలో అదే జోరును కొనసాగించింది.

కర్ణాటకలో ప్రీమియర్ షోల ద్వారా రూ.2.06 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తొలి రోజు రూ.4.12 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండు రోజుల్లో మొత్తం వసూళ్లు రూ.6.18 కోట్లకు చేరుకున్నాయి. దీంతో కర్ణాటకలో నాని కెరీర్‌లోనే ఇది అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. బెంగళూరుతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో మంచి ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!