

న్యాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు సినిమా నచ్చిందని చెబుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ ఫలితంతో సంబంధం లేకుండా కొన్ని ప్రత్యేక అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్, సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
1980ల నాటి నేపథ్యంతో, కల్పితమైన ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో గుర్తింపు కోసం పోరాడే సవారీ తెగకు అండగా నిలిచే ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ప్రియదర్శి కనిపించారు. ఈ పాత్రను చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు కేసీఆర్ గుర్తుకొచ్చేలా ఉండటంతో థియేటర్లలో మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలో పి. విజయ్ కుమార్ నటించారు. గతంలో ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. అయితే ది ప్యారడైజ్‌లో ఎన్టీఆర్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. పాత్రల రూపకల్పన, సన్నివేశాలు, సందర్భాలను బట్టి ఆ పాత్రలు ఎవరిని ప్రతిబింబిస్తున్నాయో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!