

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ది ప్యారడైజ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. దసరా తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సినిమాలో ‘దేశం’ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఒక పవర్‌ఫుల్ సాంగ్ థియేట్రికల్ వెర్షన్‌లో లేకపోయిందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాజాగా వెల్లడించారు.
లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల ఈ పాట వెనుక ఉన్న విషయాలను వివరించారు. అనిరుధ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే పనిలో బిజీగా ఉండటంతో పాటకు అవసరమైన లైవ్ ఇన్‌స్ట్రుమెంట్ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేయడానికి సమయం సరిపోలేదని తెలిపారు. దీంతో ఆ పాటను థియేట్రికల్ కట్ నుంచి తొలగించాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వెర్షన్ కోసం అనిరుధ్‌తో పాటను పూర్తి చేసి, ప్రస్తుత ఇంగ్లీష్ ట్రాక్ స్థానంలో ఈ ‘దేశం’ పాటను జోడించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!