

తమన్నా, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘ది వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి బిహార్‌లోని థియేటర్లలో ఊహించని స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు థియేటర్లను ఆలయాలుగా మార్చి పూజలు చేస్తున్నారు. ఛఠ్ పూజ వేడుకలను థియేటర్లలోనే నిర్వహిస్తున్నారు. దీనికి కారణం బిహార్ ప్రజలు ఘనంగా జరుపుకునే ఛఠ్ పూజకు సంబంధించిన సన్నివేశాలను సినిమాలో చూపించడమే. అంతేకాకుండా ‘బిహార్ కోకిల’గా ప్రసిద్ధి చెందిన దివంగత గాయని శారదా సిన్హా పాడిన ‘ఛఠీ మైయా’ భక్తి గీతాన్ని కూడా సినిమాలో ఉపయోగించారు.
ఈ పాట ప్లే అయిన సమయంలో మహిళలు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలోకి వెళ్లే ముందు బయటే చెప్పులు విడిచి, అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా థియేటర్ల వద్ద ప్రసాదాలు కూడా పంచుతున్నారు. కొందరు మహిళలు ఛఠ్ పూజ సమయంలో ధరించే సంప్రదాయ దుస్తుల్లోనే థియేటర్లకు వస్తున్నారు. మహిళలు నిర్వహిస్తున్న పూజలతో బిహార్‌లోని కొన్ని థియేటర్లు ఆలయాలను తలపిస్తున్నాయి. సినిమాకు లభిస్తున్న ఈ విశేష స్పందనతో చిత్ర బృందం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!